Hardik Pandya ruled out of Ind vs AFG ODI series due to Injury
* ఫిట్నెస్ క్లియరెన్స్ వచ్చిన గంటల్లోనే హార్దిక్ ఔట్!
ఆకేరు న్యూస్, డెస్క్: అఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా మూడు మ్యాచ్‌ల సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఆశ్చర్యకరంగా.. పూర్తి ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందిన కొద్ది గంటల్లోనే అతడు మరోసారి గాయపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
* గంటల్లో మారిపోయిన పరిస్థితి
ఐపీఎల్ సమయంలో వెన్నునొప్పితో బాధపడిన హార్దిక్, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేశాడు. పూర్తి కోటా బౌలింగ్ చేసి వైద్య బృందం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా పొందాడు.
అయితే ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఈ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం రెండు నుంచి మూడు వారాలు పట్టే అవకాశం ఉందని వైద్యులు అంచనా వేశారు.
* మేనేజ్మెంట్కు ఆందోళన
2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని హార్దిక్‌ను వన్డే జట్టులో కీలకంగా ఉపయోగించాలనే ప్రణాళికలో బీసీసీఐ ఉంది. అందుకే ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌కు కూడా అతడికి విశ్రాంతి ఇచ్చారు.
ఇలాంటి సమయంలో హార్దిక్ దూరం కావడం జట్టు సమతుల్యతపై ప్రభావం చూపనుంది.
ALSO READ :
* ఇప్పటికే కోహ్లీ కూడా దూరం
ఇప్పటికే విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు. ఇప్పుడు హార్దిక్ కూడా వైదొలగడంతో భారత జట్టుకు వరుస షాక్‌లు తగిలినట్లైంది.
* హార్దిక్ స్థానంలో ఎవరు?
శనివారం నుంచి ధర్మశాలలో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు హార్దిక్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. సెలక్షన్ కమిటీ త్వరలోనే ప్రత్యామ్నాయ ఆటగాడి పేరును ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతం హార్దిక్ గాయం తీవ్రత ఎంత? అతడు తిరిగి ఎప్పుడు మైదానంలోకి వస్తాడు? అనే అంశాలపై అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
