* మాజీ మంత్రి హరీశ్
* సర్కారుతో రణం : రుణమాఫీపై యుద్ధం
* రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న బీఆర్ ఎస్
ఆకేరు న్యూస్ డెస్క్ : ఇచ్చిన మాట ప్రకారం.. రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతుంటుంటే.. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయాలేదని ప్రతిపక్ష పార్టీ బీఆర్ ఎస్ (BRS)ఆరోపిస్తోంది. రుణమాఫీ అందని రైతుల పక్షాన పోరాటానికి సిద్ధమైంది. తమది భారత రాష్ట్ర సమితే కాదని, భారత రైతు సమితి కూడా అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలిపారు. కాగా ఈరోజు నియోజకవర్గాల వర్గాల ధర్నాలు చేపడుతోంది. కేవలం రూ.18వేల కోట్లు ఖర్చు చేసి రైతులను నిలువునా ముంచారని ప్రతీ రైతుకు తెలిసేలా ధర్నాలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో కనీసం 40శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధిచేకూరలేదని సమాచారం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ధర్నా పిలుపునకు రైతాంగం నుంచి విశేష స్పందన వస్తున్నది. చేవెళ్ల(Chevella)లో కేటీఆర్, ఆలేరు(Aleru)లో హరీశ్.. రుణమాఫీపై నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్నారు.
రుణమాఫీ విముక్తి కోసం పూజలు
రైతులకు రుణమాఫీ విముక్తి కావాలని పూజలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao). బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో ఆయన యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట ఇచ్చి తప్పినందుకు పరిహార పూజలు చేశారు. రుణమాఫీ చేయడంతో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ‘స్వామీ.. ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు.. తెలంగాణ ప్రజలపై దయ ఉంచు అని’ వేడుకున్నానన్నారు. అనంతరం అక్కడి నుంచి ఆలేరు వెళ్లి ఆందోళనలో పాల్గొన్నారు. హరీశ్‌రావు వెంట ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు గొంగడి సునీత, బూడిద బిక్షమయ్య తదితరులు ఉన్నారు.
—————————————