Jurala Flood Surge inflow touches 2.26 lakh cusecs.
ఆకేరు న్యూస్, మహబూబ్ నగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద నీరు భారీగా పోటెత్తుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమై 30 రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం వైపు నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,26,000 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 2,36,000 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
* ఎత్తిపోతలు, కాలువలకు నీటి సరఫరా..
వరద నీరు పుష్కలంగా రావడంతో ఆయకట్టు ఆధారిత ఎత్తిపోతల పథకాలైన భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నారు. వీటితో పాటు జూరాల కుడి, ఎడమ ప్రధాన కాలువలకు కూడా నీటి సరఫరా పునరుద్ధరించారు.
* పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి..
మరోవైపు ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తి వేగవంతమైంది. జల విద్యుత్ కేంద్రంలోని 9 యూనిట్లలో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలను, మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
