Published:
ఆకేరు న్యూస్ ,గద్వాల ః జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రాజెక్టు అధికారులు 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. పైనున్న మహారాష్ట్ర, కర్నాటకలో గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతుండడంతో జూరాలకు వరదనీటి ప్రవాహం ఎక్కువైందని అధికారులు చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతూనే ఉన్నారు. తాజాగా వరద ఉధృతి ఎక్కువ కావడంతో గేట్లు కూడా బలహీన పడే అవకాశం ఉంది. దీంతో దిగువ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
………………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
