ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఐదు రోజులపాటు, తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది . ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు పార్వతీపురం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.. కాగా.. రాత్రి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
తెలంగాణలో..
తెలంగాణలో నేటి నుంచి రెండు లేదా మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈరోజు అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
————–