
* వాతావరణ శాఖ హెచ్చరిక
* హైదరాబాద్లో అధికారులు అప్రమత్తం
* నిన్న సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు కురుస్తూనే ఉన్న వాన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు (Allert) జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్(Warangal), ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరుగా కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్లో ఆకాశం ఉదయం నుంచి మేఘావృతమై ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాజధాని హైదరాబాద్లో వాతావరణం నిన్న సాయంత్రం నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. సాయంత్రం మొదలైన వాన తెల్లావారు జాము వరకూ కురుస్తూనే ఉంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను(Mansoon Emergency Teams) రంగంలోకి దింపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం సహా ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉండటంతో.. ద్రోణి ప్రభావం కారణంగా మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
……………………………………………..