* తాజా పరిణామాల నేపథ్యంలో అప్రమత్తం
* కోల్కతాకు చేరుకున్న బీఎస్ ఎఫ్ డీజీ
ఆకేరు న్యూస్ డెస్క్ : బంగ్లాదేశ్(Bangladesh) లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత సరిహద్దులను రక్షించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force) అప్రమత్తమైంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు (India-Bangladesh border) వెంబడి హై అలర్ట్ (High alert) ప్రకటించింది. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. తాజా పరిస్థితి నేపథ్యంలో ముందస్తు చర్యల కోసం బీఎస్ఎఫ్ డీజీ (BSF DG) ఇప్పటికే కోల్కతాకు చేరుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల (Reservations) కు సంబంధించి మొదలైన గొడవ ‘చినుకు చినుకు గాలివానలా మారినట్లు’ పెరిగిపోయింది. తీవ్ర హింసకు దారితీసింది. వందల మంది మరణానికి కారణమైంది.
——————–