ఆకేరున్యూస్, హైదరాబాద్: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై తెలంగాణ హైకోర్టు (HIGH COURT) ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలో మూడుసార్లు ఫుడ్ పాయిజనింగ్ (FOOD POSION) జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది. స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ చాలా సీరియస్ అంశమని సీజే జస్టిస్ అలోక్ అరాధే (JUSTICE LOK ARAADE) అన్నారు. అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనమని.. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవడం లేదంటూ విమర్శించింది. ఘటనపై వారంలోగా కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫున న్యాయవాది హైకోర్టుకు తెలుపగా.. ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల సేకరణకు వారం సమయం ఎందుకని నిలదీసింది. కాగా, మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని హైకోర్టులో పిల్ దాఖలైంది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో తరుచూ భోజనం వికటిస్తుందని ప్రభాకర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
…………………………………..