* ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన కోర్టు
* నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ అంతిమ తీర్పు
ఆకేరు న్యూస్, హైకోర్టు : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల (Dilsukhnagar Bomb Blast Case) నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ అంతిమ తీర్పు వెలువడింది. 2016 డిసెంబర్ లో ఎన్ఐఏ (NIA) కోర్టు ఖరారు చేసిన ఉరిశిక్షను తెలంగాణ హైకోర్టు కూడా ఈరోజు సమర్థించింది. నిందితులు వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దోషులు అసదుల్లా అక్తర్(ఏ2), జియా ఉర్ రెహమాన్ రెహ్మాన్(ఏ3), తహసీన్ అక్తర్(ఏ4), యాసిన్ భక్తల్(ఏ5), అజాజ్‌కు ఉరిశిక్ష ఖరారైంది. ఈకేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. 2013 ఫిబ్రవరి 21న దిల్ సుఖ్నగర్లో బాంబు పేలుళ్లు జరిగాయి. టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి ఉగ్రవాదులు పేలుళ్లకు (Bomb Blast) పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 130 మందికి గాయాలు అయ్యాయి. ఈ కేసులో యాసిన్ భత్కల్ కీలక నిందితుడు. ఏ1 రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో దోషులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంతేకాదు.. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్ట్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధతో కూడిన ధర్మాసనం.. దోషులందరికీ ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. సుమారు 45 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు (Highcourt) ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పును వెల్లడించింది.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
