Huzurabad Rahul Gandhi Birthday
* పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు హుజరాబాద్ లో ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు ఆధ్వర్యంలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, యూత్ కాంగ్రెస్, NSUI, సేవాదళ్ నాయకులు, సొసైటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
