Gold Price Fall India
ఆకేరు న్యూస్, డెస్క్:కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.
కొనుగోలుదారులకు భారీ ఉపశమనం కలిగిస్తూ.. ఒకే రోజు తులం బంగారంపై ఏకంగా రూ.3,600 పైగా తగ్గగా, వెండి ధర కూడా ఊహించని విధంగా దిగివచ్చింది.
* ధరల వివరాలు ఇలా ఉన్నాయి…
24 క్యారెట్ల బంగారం (ప్యూర్ గోల్డ్): 10 గ్రాముల (తులం) ధరపై ఏకంగా రూ.3,650 తగ్గింది. దీంతో మార్కెట్లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,860 మార్కుకు చేరుకుంది.
22 క్యారెట్ల బంగారం (ఆభరణాల బంగారం): నిలకడగా ఉన్న ఆభరణాల బంగారంపై 10 గ్రాములకు రూ.3,350 మేర కోత పడింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,33,700 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు (Silver Rate): బంగారం బాటలోనే వెండి కూడా భారీగా పతనమైంది. కిలో వెండిపై ఏకంగా రూ.15,000 వరకు తగ్గడం గమనార్హం. ఈ భారీ తగ్గింపుతో ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,55,000 లకు చేరింది.
* తగ్గడానికి కారణాలు…
గ్లోబల్ మార్కెట్లో డాలర్ విలువ పుంజుకోవడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి కారణాల వల్లే బులియన్ మార్కెట్లో ఈ స్థాయిలో ధరలు తగ్గినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ స్థాయిలో ధరలు తగ్గడం పట్ల మధ్యతరగతి ప్రజలు, కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజులు ఈ తగ్గుదల ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
