Hyderabad Bomb Threat (AI Generate Image)
* కాచిగూడ స్టేషన్ టార్గెట్..!
* ముంబై తరహా దాడులంటూ ఈ-మెయిల్..
* లష్కరే తోయిబా పేరుతో బెదిరింపు..!
ఆకేరు న్యూస్, డెస్క్: హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు ఈ-మెయిల్ కలకలం రేపింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌తో పాటు నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌ను పేల్చివేస్తామంటూ (Hyderabad bomb threat) గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లష్కరే తోయిబా పేరుతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు నవంబర్ 21న రాత్రి 7:13 గంటలకు ఈ-మెయిల్ వచ్చినట్లు సమాచారం.
* డిస్పోజబుల్ మెయిల్ ఐడీతో బెదిరింపులు..
ఈ బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తులు తమ ఆచూకీ లభించకుండా ఉండేందుకు డిస్పోజబుల్ ఈ-మెయిల్ ఐడీని ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ముంబై తరహా దాడులకు (Hyderabad bomb threat) పాల్పడతామంటూ మెయిల్లో హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ బెదిరింపుల వెనుక ఎవరున్నారు? నిజంగానే దాడులకు కుట్ర చేస్తున్నారా? లేక ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఈ చర్యకు పాల్పడ్డారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.
* VPN, IP అడ్రస్ ఆధారంగా దర్యాప్తు..
బెదిరింపు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి పంపించారనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు. VPN వినియోగం, IP అడ్రస్ వివరాల ఆధారంగా నిందితుల ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ-మెయిల్ వెనుక ఉన్న వ్యక్తులు, వారి ఉద్దేశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
* రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో నిఘా..
ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేస్తున్నారు. బాంబు బెదిరింపు ఈ-మెయిల్ నేపథ్యంలో నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నిందితులను గుర్తించి పూర్తి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read : పెట్టుబడుల పండుగకు తెలంగాణ రెడీ!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

