* అధికారుల కాళ్లు మొక్కుతూ.. కూల్చవద్దంటూ వేడుకోలు
* మూడు ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లో హైడ్రా(HYDRA) ఆదివారం అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపిస్తోంది. ఏకకాలంలో మూడు ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టింది. కూకట్పల్లి నల్ల చెరువు(KUKATPALLY NALLA CHERUVU), అమీన్పూర్ చెరువు(AMEENPUR CHERUVU), సంగారెడ్డి జిల్లా కృష్టయ్యపేట(KRISTAYYAPET) ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లోని విలువైన వస్తువులను కూడా బయటకు తీసుకెళ్లనివ్వకుండా కూల్చివేస్తున్నారని అమీర్చెరువు పరిధిలోని బాధితులు రోదిస్తున్నారు. కూల్చివేతల వద్ద కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారుల కాళ్లు పట్టుకుని బతిమలాడారు. రూ.50 లక్షలు పెట్టి ఫుడ్ క్యాటరింగ్ స్టాల్ను కట్టుకున్నానని, కనీసం సామాన్లు కూడా తీసుకొనివ్వలేదని ఓ బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దలకు నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్న హైడ్రా(HYDRA) అధికారులు పేదల పట్ల మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
……………………………….