* 11 రోజుల అనంతరం వెంకటేశ్వరుడి దర్శనం
ఆకేరు న్యూస్, గుంటూరు : తిరుపతి లడ్డూ(TIRUPTHI LADDU) విషయంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చితంగా అంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP DEPUTY CM PAVAN KALYAN)దీక్ష చేపట్టారు. నేటి నుంచి 11 రోజులపాటు ప్రాయశ్చిత దీక్ష కొనసాగనుంది. నంబూరి వేంకటేశ్వర స్వామి (VEKATESWARA SWAMI)ఆలయంలో ఈరోజు దీక్ష చేపట్టారు. దీక్షకు ముందు పవన్ మాట్లాడుతూ.. వైసీపీ(YCP) పాలనలో 219 ఆలయాలను అపవిత్రం చేశారని తెలిపారు. లడ్డూ వివాదంలో ఎలాంటి రాజకీయపేక్ష లేదన్నారు. గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అమృతతుల్యమైన తిరుపతి లడ్డూ అపవిత్రమైందన్నారు. ఆ విషయం తెలిసిన మరుక్షణం తన మనసు కలతచెందిందన్నారు. తిరుపతి లడ్డూను మహా ప్రసాదంగా భావిస్తామని, ప్రతి ఒక్కరూ మనసును ప్రాయశ్చితం చేసుకోవాలని, దానిలో భాగంగానే ప్రాయశ్చిత దీక్ష చేపట్టానన్నారు.
…………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
