* ఆయన రాజకీయాలను చూషి భయపడి పారిపోయేవారు
* జగన్‌ను రాజకీయంగా అంతం చేసేందుకు కుట్ర
* హత్యా రాజకీయాల కంటే నీచమైన చర్యలు
* శ్రీవారికి కళంకం అంటగడుతున్నారు
* మీ ఇంటి దేవుడైనా వెంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాలకు వాడతారా?
* లడ్డూ వివాదంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్చితో విచారణ చేపట్టాలి
* టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి
ఆకేరు న్యూస్, తిరుపతి : శకుని బతికి ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు(AP CM CHANDRABABU)ను చూసి బావురుమనేవారని, ఆయన రాజకీయాలను చూషి భయపడి పారిపోయేవారని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి(TTD EX CHAIRMAN KARUNAKAR REDDY) ధ్వజమెత్తారు. జగన్‌ను రాజకీయంగా అంతం చేసేందుకు నీచమైన రాజకీయాలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారికి కళంకం అంటగడుతున్నారని, మీ ఇంటి దేవుడైనా వెంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాలకు వాడతారా? అని ప్రశ్నించారు. లడ్డూ కల్తీ వివాదంపై ఆయన తిరుపతి(TIRUPATHI)లో మీడియాతో మాట్లాడారు. హత్యా రాజకీయాల కంటే నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. గౌరవనీయమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి దారుణంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నెయ్యికి బదులుగా జంతు కొవ్వు, చేప నూనె అంటున్నారని.. కనీసం నెయ్యిలో కలిపారని కూడా కాదని, ఇంతకంటే దుర్మార్గమైన ఆరోపణలు ప్రపంచ రాజకీయాల్లోనే ఉండవని తెలిపారు.
* సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి
కలుషితం అయింది లడ్డూ కాదని, మీ మనసు అని, మీరని చంద్రబాబును ఉద్దేశించి కరుణాకర్‌రెడ్డి తెలిపారు. లడ్డూ కల్తీపై సీబీఐ(CBI) ద్వారా గానీ, సుప్రీంకోర్టు జడ్జి(SUPRIM COURT JUDGE)తో కానీ విచారణ జరిపించాలన్నారు. ప్రధానమంత్రి(PRI ME MINISTER) దీనిపై జోక్యం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు చేసిన ఆరోపలు నిజమైతే.. చేసినవాళ్లు రక్తం కక్కుకుని చావాలని వెంకటేశ్వర స్వామికి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆబద్దమైతే ఆ స్వామే మీకు సరైన శిక్ష విధిస్తారని హెచ్చరించారు. సొంతమామనే వెన్నుపోటు పొడిచి ఈరోజు పూలదండలు వేస్తున్న ఘన చరిత్ర ఆయనదన్నారు. మీ కుటుంబ దేవుడని చెప్పుకునే వెంకటేశ్వరుని కూడా రాజకీయాల్లోకి లాగడం తగదని పేర్కొన్నారు. టీటీడీ(TTD) కమిటీ ఇచ్చిన విజిలెన్స్ నివేదిక చంద్రబాబుకు నచ్చలేదని విమర్శించారు.
………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
