ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా(Hydra) బాంబ్లు పేలుస్తూనే ఉంది. వాళ్లు, వీళ్లూ అనే తేడా లేకుండా అందరికీ నోటీసులు జారీ చేస్తోంది. ఆ జాబితాలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి(Tirupathireddy) ఉండడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి గురువారం హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు. కాగా, విషయంపై తిరుపతి రెడ్డి స్పందించారు. తాను 2015లో అమర్ సొసైటీ(Amar Society) లో ఇంటిని కొనుగోలు చేశానని, ఆ సమయంలో తాను కొన్న ఇల్లు ఎఫ్టీఎల్(FTL) పరిధిలో ఉందనే సమాచారం తెలియదని చెప్పుకొచ్చారు. అలాగే తాను ఉంటున్న నివాసం.. ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ప్రభుత్వం, హైడ్రా ఎటువంటి చర్యలూ తీసుకున్న తనకు అభ్యంతరం లేదని ప్రకటించారు. కాగా దుర్గం చెరువును అనుకుని ఉన్న కావూరి హిల్స్, సెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది. అలాగే నెల రోజుల్లో అక్రమ కట్టడాలు అన్ని స్వచ్ఛందంగా కూల్చేయాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Related Stories
December 4, 2024
December 4, 2024
December 3, 2024