* 160 రోజుల విరామం తర్వాత ఎమ్మెల్సీ కవిత ట్వీట్..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam) లో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి బెయిల్‌పై బయటకు వచ్చిన కవిత బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఐదు నెలల తర్వాత తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సొంత గడ్డపై కవిత (Kavitha)కు అపూర్వ స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ఎక్స్ వేదికగా తొలి ట్వీట్ (first tweet) పెట్టారు. సత్యమే గెలిచిందంటూ పేర్కొన్నారు. ‘సత్యమేవ జయతే’ అని ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్‌కు తన నివాసానికి చేరుకున్న అనంతరం భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో కలిసి అభిమానులకు అభివాదం చేస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. కవిత చివరిసారిగా మార్చి 14న ఎక్స్ వేదికగా ట్వీట్(Tweet) చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
