* ఫామ్ హౌస్‌కు కవిత
* కుమార్తెను చూసి భావోద్వేగానికి లోనైన కేసీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఐదు నెలల తర్వాత తండ్రి కేసీఆర్(KCR)ను కలుసుకున్నారు ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA). ఢిల్లీ లిక్కర్ స్కాం (DELHI LIQUIOR SCAM)కేసులో బెయిల్ వచ్చిన తరువాత గురువారం ఫామ్‌హౌస్(fORM HOUSE)కు ఎమ్మెల్సీ కవిత వెళ్లారు. తన తండ్రి కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్ నుంచి ఉదయాన్నే బయల్దేరిన ఆమె సిద్దిపేట(SIDDIPETA) జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫాంహౌజ్‌కి చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్, కుమారుడు కూడా ఉన్నారు. ఆమెకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్.. కవితను చూసిన వెంటనే ఆమెను హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. కవితకు తండ్రి కాళ్లకు నమస్కరించారు. కవిత రాకతో ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో సంతోషం వెల్లివిరిసింది. పదిరోజుల పాటు ఫామ్ హౌస్ లోనే ఉండనున్నట్లు కవిత(KAVITHA) వెల్లడించారు. ఆ తర్వాత కార్యకర్తలను కలుస్తానని ప్రకటించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
