* కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం హైడ్రా(HYDRA)కు రూ. 50 కోట్ల నిధులను విడుదల చేసింది. కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు ఈ నిధులను వెచ్చించవచ్చునని పేర్కొంది. త్వరలో హైడ్రా పోలీ్‌సస్టేషన్(HYDRA POLICE STATION)ను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవలే కమిషనర్ రంగనాథ్(COMMISSIONOR RANGANATH) ప్రకటించారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారుల ఆక్రమణలపై ఫిర్యాదులను స్వీకరిస్తామని, వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జీవకోటికి ప్రాణాధారమైన జల వనరులను పరిరక్షించి, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు హైడ్రా కృషిచేస్తోందన్నారు. ఇప్పుడు నిధులు కేటాయించి ప్రభుత్వం సహకరించడంతో హైడ్రా మరింత దూకుడు ప్రదర్శించనుంది.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
