* రూ. 5 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తాం.
* తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందజేస్తామని తెలిపారు. భారీవార్షాలు పడే సూచన ఉన్న ఆయా ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టరేట్ల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని ఎనిమిది పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు.