Chef Mantra Project K Season 6
* సుమ, నందినీ రెడ్డితో ఫన్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్
* ఈ నెల 10 నుంచి ఆహాలో స్ట్రీమింగ్..
* ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఆహా ఓటీటీలో సూపర్ హిట్‌గా కొనసాగుతున్న వంటల కార్యక్రమం చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 6 లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో సందడిగా జరిగింది. ఫన్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్తో సాగనున్న ఈ కొత్త సీజన్లో యాంకర్ సుమ, డైరెక్టర్ నందినీ రెడ్డి జడ్జ్‌లుగా వ్యవహరించనున్నారు. సరదా మాటలు, రుచికరమైన వంటలు, కంటెస్టెంట్ల వినోదంతో ఈ సీజన్ ప్రేక్షకులను అలరించనుంది. చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 6 తొలి ఎపిసోడ్ సెప్టెంబర్ 10 రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇకపై ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్ అందుబాటులో ఉంటుంది.
* ఆహా ప్రతినిధి కవిత మాట్లాడుతూ
చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె ప్రారంభించినప్పుడు ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదని ఆహా ఓటీటీ ప్రతినిధి కవిత అన్నారు. ఇప్పుడు విజయవంతంగా ఆరో సీజన్‌కు చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. ట్రైలర్ కూడా చాలా బాగుందని, ప్రేక్షకులు ఈ సీజన్‌ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సుమ, నందినీ రెడ్డి కోసం కూడా ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని చూస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. పాత్ బ్రేకింగ్ షోలను ప్రేక్షకులకు అందించడంలో ఆహా ముందుంటుందని, చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 6 కూడా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
* 14 ఏళ్లుగా విజయవంతమైన ప్రయాణం
షో క్రియేటర్ నితిన్ మాట్లాడుతూ తాము ఏ కార్యక్రమం చేసినా ఎంజాయ్ చేస్తూ నిర్వహిస్తామని చెప్పారు. తమ ప్రయాణం 14 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతోందన్నారు. సుమ, నందినీ రెడ్డి, ఆహా సహకారం లేకుండా ఈ షో ఇంత బాగా వచ్చేది కాదని తెలిపారు. కంటెస్టెంట్లందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ఈసారి శ్రీపాద కూడా క్రియేటర్‌గా పనిచేశారని వెల్లడించారు. తమకు నిరంతరం మద్దతు ఇస్తున్న ఆహాకు కృతజ్ఞతలు తెలిపారు.
మరో షో క్రియేటర్ భరత్ సరదాగా మాట్లాడుతూ అందరూ సుమ, నందినీ రెడ్డికి థ్యాంక్స్ చెబుతున్నారని, తాము మాత్రం సారీ చెప్పాలని అన్నారు. ఇలాంటి ఫుడ్ తినిపిస్తున్నందుకు సారీ అంటూ నవ్వించారు. ఈ షో ద్వారా మంచి ఫుడ్‌తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తామని చెప్పారు.
* మళ్లీ విన్నర్‌గా నిలిచిన కావ్య
కంటెస్టెంట్ కావ్య మాట్లాడుతూ గతంలో చెఫ్ మంత్రలో పాల్గొని విన్నర్‌గా నిలిచానని తెలిపారు. మరోసారి ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్‌గా రావడం సంతోషంగా ఉందన్నారు. సీజన్ 6 ప్రేక్షకులను సూపర్బ్‌గా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పారు. సుమ, నందినీ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన కావ్య.. ఇలాంటి మరెన్నో సీజన్స్ రావాలని, తమను మరోసారి కంటెస్టెంట్లుగా పిలవాలని కోరుకున్నారు.
* బ్యాక్ టు బ్యాక్ సీజన్స్‌లో అర్జున్
కంటెస్టెంట్ అర్జున్ అంబటి మాట్లాడుతూ చెఫ్ మంత్ర ప్రతి సీజన్లోనూ మరింత పెద్ద స్థాయికి వెళ్తోందన్నారు. ఈ కార్యక్రమాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారని చెప్పారు. వరుస సీజన్స్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని, సీజన్ 6 మరింత మంది సబ్స్క్రైబర్లను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
* వంట రాని వారితోనే వంటలు
కంటెస్టెంట్ రీతు చౌదరి మాట్లాడుతూ అసలు వంట రాని తనను, విష్ణు ప్రియను జోడీగా పెట్టారని సరదాగా చెప్పారు. తాము చేసిన వంటలను సుమ, నందినీ రెడ్డి భరిస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ నవ్వించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఆహా టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
* కొత్త అనుభవం అంటున్న నందినీ రెడ్డి
డైరెక్టర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ తాను సాధారణంగా రియాలిటీ షోలు ఎక్కువగా చూడనని చెప్పారు. అయితే నితిన్, భరత్ గురించి తెలుసుకున్న తర్వాత వారు రియాలిటీ షోలలో రాజమౌళి లాంటి వారని అర్థమైందన్నారు. అరవింద్, సుమ కారణంగానే ఈ షోలోకి వచ్చానని తెలిపారు. ఈ కార్యక్రమం తనకు కొత్త అనుభవమని, అందరిలో తానే జూనియర్‌నని అన్నారు. షోలో రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పారు. కంటెస్టెంట్లు చేసే రెసిపీలు, వేసే పంచ్‌లు, సరదా మాటలను ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. సుమతో కలిసి ఈ షో చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
యాంకర్ సుమ మాట్లాడుతూ గత ఐదు సీజన్స్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన తాను ఇప్పుడు ఆరో సీజన్‌కు కూడా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈసారి తనతో పాటు నందినీ రెడ్డిని తీసుకొచ్చానని చెప్పారు. తొలుత నందినీ రెడ్డి ఈ షో చేయలేనని చెప్పినా.. తాను చేయగలరని ఒప్పించి తీసుకొచ్చానని సుమ తెలిపారు. ఈ షోలో వంట చేసే కంటెస్టెంట్లలో చాలామందికి అసలు వంట చేయడం తెలియదని, అలాంటి వారినే కావాలని సెలెక్ట్ చేస్తున్నారని సరదాగా చెప్పారు.
చెఫ్ మంత్రను అమెరికాలోని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేయడంలో రామ్మోహన్, కవిత, హరిప్రియ, శ్రావణి కీలక పాత్ర పోషించారని సుమ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి కంటెస్టెంట్‌కు హార్టీ కంగ్రాట్స్ తెలిపారు. ఫన్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్తో సాగనున్న చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 6 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
