
హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం మృతి
* 17 గంటల అన్వేషణ తర్వాత ధ్రువీకరణ
ఆకేరు న్యూస్, డెస్క్ : హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ప్రమాదానికి గురైంది. అజార్ బైజాన్ సరిహద్దు నుంచి హెలికాప్టర్ ప్రారంభమైంది. బయలుదేరిన 30 నిమిషాల తర్వాత హెలికాప్టర్ పైలట్, ఇరాన్ అధ్యక్షుడితో కమ్యూనికేషన్ సంబంధాలు కట్ అయ్యాయి. బోలా సిటీ సమీపంలో వాతావారణం అనుకూలించకపోవడంతో జోల్ఫాలో కూలిపోయింది. దీంతో భద్రతా దళాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. ఇబ్రహీం ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన బలగాలు విమానా ప్రమాద స్థలాన్ని గుర్తించారు. 17 గంటల తర్వాత గాలింపు తర్వాత హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతోపాటు విదేశాంగ మంత్రి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇబ్రహీం మృతి ప్రపంచ దేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఇరాన్-అజర్బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్ కలాసీ, ఖొదావరిన్ అనే రెండు డ్యాంలను అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. అనంతరం తిరిగి వెళ్తుండగా విమానం కుప్పకూలిపోయింది.
———————