India vs Ireland T20
* ఒక్క పరుగు తేడాతో టీమిండియా పరువు పోయింది..
ఆకేరు న్యూస్, డెస్క్:
టీ20 ప్రపంచకప్-2026 ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు ఘోర అవమానం ఎదురైంది. పసికూనగా భావించిన ఐర్లాండ్ చేతిలో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-2తో కోల్పోయి చరిత్రలోనే అరుదైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది.
బెల్ఫాస్ట్లో జరిగిన రెండో టీ20లో చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో భారత్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.
ఈ విజయంతో ఐర్లాండ్.. భారత్‌పై తొలి టీ20 సిరీస్ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది.
* తొలి ఓవర్లోనే షాక్.. గోల్డెన్ డక్స్‌తో కుప్పకూలిన టాపార్డర్
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఇద్దరూ తొలి బంతికే గోల్డెన్ డక్స్గా వెనుదిరిగారు. ఆ వెంటనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా కేవలం 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. కేవలం 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది.
ఇషాన్ కిషన్ (12) కూడా అనవసర రనౌట్‌తో వెనుదిరగడంతో 35 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది.
* ఒంటరి పోరాటం చేసిన తిలక్ వర్మ
ఆ క్లిష్ట పరిస్థితుల్లో తిలక్ వర్మ మరోసారి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. తిలక్ వర్మ 46 బంతుల్లో 55 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. ఇందులో 5 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
అయితే మరో ఎండ్‌లో అక్షర్ పటేల్ (17), శివమ్ దూబే (20) పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోవడంతో భారత్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. కీలక సమయంలో తిలక్ ఔటవ్వడంతో భారత్ విజయావకాశాలు దాదాపు ముగిశాయి.
* చివర్లో హర్షిత్ రాణా పోరాటం వృథా
చివరి ఓవర్లో భారత్ విజయానికి 20 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో హర్షిత్ రాణా వరుస బౌండరీలు, సిక్సర్‌తో మ్యాచ్‌ను ఉత్కంఠభరితం చేశాడు. 10 బంతుల్లోనే 21 పరుగులు చేసి గెలిపించినంత పని చేశాడు.
చివరి బంతికి భారత్‌కు 7 పరుగులు అవసరమయ్యాయి. అరంగేట్ర ఆటగాడు ప్రిన్స్ యాదవ్ భారీ సిక్సర్ బాదినా.. ఒక్క పరుగు తేడాతో భారత్ ఓటమి పాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 153 పరుగులకే పరిమితమైంది.
* హ్యారీ టెక్టర్ హాఫ్ సెంచరీ.. ఐర్లాండ్ పోరాట స్కోరు
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు కూడా ఆరంభంలో వికెట్లు కోల్పోయింది. కానీ హ్యారీ టెక్టర్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అతడు 47 బంతుల్లో 53 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
బెంజమిన్ కాలిట్జ్ (37), జార్జ్ డోక్రెల్ (19) కూడా విలువైన పరుగులు జోడించడంతో ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది.
భారత్ తరఫున అరంగేట్ర ఆటగాడు ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకోగా.. అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
* మరోసారి బెంచ్‌కే పరిమితమైన వైభవ్ సూర్యవంశీ
సిరీస్‌లో వరుసగా బ్యాటర్లు విఫలమవుతున్నప్పటికీ.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి జట్టులో అవకాశం ఇవ్వకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ అతడిని బెంచ్‌పైనే ఉంచడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
* 16 సిరీస్‌ల విజయాల పరంపరకు బ్రేక్
ఈ ఓటమితో టీమిండియా వరుసగా 16 టీ20 సిరీస్‌లు గెలిచిన అద్భుత రికార్డుకు కూడా తెరపడింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన కొద్ది రోజులకే పసికూన ఐర్లాండ్ చేతిలో క్లీన్‌స్వీప్ కావడం భారత క్రికెట్ అభిమానులకు భారీ షాక్‌గా మారింది.
