* నిమిషా ప్రియ ఉరిశిక్ష వాయిదా
* మహది కుటుంబసభ్యలతో సంప్రదింపులు జరుపుతున్న ప్రభుత్వం
* బ్లడ్ మనీ ఒప్పందానికి ప్రయత్నాలు
* మత్తు మందు డోస్ ఎక్కవై మరణించిన మహది
* నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష విధించిన యెమెన్ న్యాయస్థానం
ఆకేరున్యూస్ డెస్క్ఎ : న్నో ప్రశ్నలు…ఎన్నో అనుమానాలు.. ఎన్నో సందేహాలు.. ఎంతో ఉత్కంఠ
అంతర్జాతీయంగా ఆసక్తిగా మారింది నిమిషా ప్రియ కేసు .నిమిషా ప్రియకు రేపు ఖరారైన ఉరిశక్ష ప్రస్తుతానికి వాయిదా పడింది. ఉరి శిక్ష అయితే వాయిదా పడింది . మహది కుటుంబ సభ్యులు బ్లడ్ మనీ స్వీకరించడానికి ఒప్పుకుంటే నిమిషా ప్రియకు పడ్డ ఉరి శిక్ష యావజ్జీవ కారాగార శిక్షగా మారే అవకాశం ఉంది.11 కోట్ల బ్లడ్ మనీ తీసుకోవడానికి మహది కుటుంబ సభ్యలు ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయు
ఎవరీ నిమిషా ప్రియ..
కేరళలోని పాలక్కాడ్ కు చెందిన నిమిషా ప్రియ 1 జనవరి 1989లో జన్మించింది. కేరళలో డిగ్రీ పూర్తి చేసుకున్న తరువాత ఆమె బతుకు తెరువు కోసం 2011లో యెమెన్ దేశానికి వెళ్లింది. యెమెన్ రాజధాని సనాలో ఓ క్లినిక్ లో నర్స్‌గా చేరింది. ఈ క్రమంలో ఖతార్‌లో డ్రైవర్ గా పని చేస్తున్న టామీ థామస్ తో నిమిషా ప్రియకు వివాహం జరిగింది. వారికి మిచెల్లీ టామీ అనే ఓ కూతురు ఉంది. ఈ క్రమంలో 2014 లో యెమెన్ లో అంతర్యుద్ధం చెలరేగి రాజకీయ అస్తిరత్వం ఏర్పడడంతో నిమిషా ప్రియ కుటుంబం కేరళకు వచ్చింది, నిమిషాప్రియ భర్త థామస్ కూతురు మిచెల్లీతో ఇండియాలోనే ఉండగా నిమిషా ప్రియ మాత్రం తిరిగి యెమెన్ కు వెళ్లింది. యెమెన్ రాజధాని సనాలో తిరిగి నర్స్ ఉద్యోగంలో చేరింది.
అబ్దో మహదితో పరిచయం
సనాలోని నర్సింగ్ హోంలో పనిచేస్తున్న నిమిషాకు వస్త్ర వ్యాపారి అయిన అబ్దో మహతితో పరిచయం ఏర్పడింది. అబ్దో మహది ప్రెగ్నెంట్ గా ఉన్న తన భార్యను తీసుకొని తరచూ నిమిషా ప్రియ పనిచేస్తున్న క్లినిక్ కు వచ్చేవాడు. ఈ నేపధ్యంలో నిమిషాకు అతనితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే నిమిషా ప్రియ కేరళకు వచ్చినప్పుడు అతడు కూడా వచ్చాడు.. ఈ క్రమంలో అబ్దో మహది సహాయంతో ఆమె సనాలో ఓ క్లినిక్ ని ప్రారంభించింది, యెమెన్ చట్టాల ప్రకారం యెమెన్ దేశంలో ఎవరైనా విదేశీయులు వ్యాపారం ప్రారంభించాలంటే యెమెన్ దేశస్థుల భాగస్వామ్యంతోనే ప్రారంభించాలి. ఈ క్రమంలో నిమిషా మహది భాగస్వామ్యంలో నర్సింగ్ హోంను ప్రారంభించారు.
మానసికంగా, భౌతికంగా హింసించేవాడు..
అబ్దో మహది తనను భౌతికంగా మానసికంగా హింసించే వాడని నిమిషా గతంలో తెలిపింది. క్లినిక్ లో తన పెట్టుబడి ఎక్కువగా పెట్టినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించాడని తెలిపింది. అబ్దో మహది ఇండియాకు వచ్చినప్పుడు నిమిషా థామస్‌ల పెళ్లి ఫోటోను తీసుకెళ్లాడని తెలిసింది. పెళ్లి ఫొటోను మార్ఫింగ్ చేసి థామస్ స్తానంలో తన ఫోటోను పెట్టి నిమిషాను తాను పెళ్లి చేసుకున్నట్లుగా ప్రచారం చేసుకున్నాడని సమాచారం. ఈ విషయంపై నిమిషా హమీద్ తండ్రికి ఫిర్యాదు చేసినా అతడు స్పందించలేదని సమాచారం నిమిషా ఇండియాకు తిరిగి వెళ్లకుండా ఆమె దగ్గన ఉన్న పాస్ పోర్టును మహీద్ తీసుకోవడంతో నిమిష ప్రియకు ఏంచేయలేని పరిస్తిలో ఎదురైంది . ఈ నేపధ్యంలో 2017లో మహదికి మత్తు మందు ఇచ్చి అతడు గాఢ నిద్రలోకి జారుకున్న తరువాత అతడి వద్ద నుండి పాస్ పార్టు తీసుకోవచ్చని భావించి మహదికి మత్తు మందు ఇచ్చింది. మత్త మందు డోస్ ఎక్కువ కావడంతో మహది చనిపోయాడు. దీంతో కంగారు పడిన నిమిషా మరో నర్సు సహాయంతో మహది శరీరాన్ని ముక్కులు ఉక్కుల చేసి భూగర్భంలో ఉన్న ఓ ట్యాంకులో వేసింది. పాస్ పోర్టు తీసుకొని దేశం విడిచి వెళ్లిపోయే ప్రయత్నంలో యెమెన్ పోలీసులకు చిక్కింది.
ఉరిశిక్ష విధించిన యెమెన్ న్యాయస్థానం
నిమిషా అబ్దో మహదిని హత్య చేసినట్టు రుజువు కావడంతో యెమెన్ న్యాయస్థానం నిమిషాకు ఉరిశిక్షను ఖరారు చేసింది. 2017 నుంచి ఈ ఉరిశిక్ష తేదీ ఖరారు కాకుండా పెండింగ్ లో ఉంది. తనకు క్షమా భిక్ష పెట్టమని తాను హత్య చేసినట్లుగా అంగీకరించడంలేదని అది యాధృచ్చికంగా జరిగిన సంఘటన అని నిమిషా యెమెన్ కోర్టు ను ఆశ్రయించింది. చిట్టచివరికి జులై 15 2005న ఉరిశిక్ష తేదీని యెమెన్ న్యాయస్థానం ప్రకటించింది. అయితే జులై 14న నిమిషా ఉరిశిక్షను వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. నిమిఫా కుటుంబానికి మహది కుటుంబానికి మద్య బ్లడ్ మనీ ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. బ్లడ్ మనీ ఒప్పందం కుదిరిన నేపధ్యంలోనే నిమిషాప్రియ ఉరిశిక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది.
బ్లడ్ మనీ అంటే ఏమిటి..
బ్లడ్ మనీ అనేది ఓ నష్టపరిహారం లేక కంపన్సేషన్ అంటారు. ఇది ముస్లిం దేశాల్లో అమలులో ఉంది. ఎవరైతే నేరస్థుల చేతిలో హత్యకు గురవుతారో లేదా నేరస్థుల చేతిలో యాక్సిడెంట్ కు గురై మరణిస్తారో వారి కుటుంబసభ్యులకు నేరస్థుల కుటుంబ సభ్యులు ఇచ్చే నష్ట పరిహారం అంటారు. నేరస్థుల కుటుంబ సభ్యలు ఇచ్చే నష్టపరిహారాన్ని బాదిత కుంటుబం తీసుకుంటే సదరు నేరస్థునికి శిక్ష తగ్గుతుంది. లేదా జైలునుంచి విముక్తి లభిస్తుంది. యెమెన్ వాస్తవ్యుడు అబ్దో మహది హత్య కేసులో జులై 15న ఉరిశిక్ష ఖరారు చేయబడ్డ నిహిషా ప్రియ ఉరిశిక్షను యెమెన్ న్యాయస్థానం తాత్కాలికంగా వాయిదా వేసింది. నిమిషా తల్లి ప్రేమ్ కుమారి ప్రస్తుతం యెమెన్ లోనే ఉంది. యెమెన్ లో ఉన్న సామాజిక కార్యకర్త సామ్యూల్ జెరోమ్ సహాయంతో మహది కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కేరళకు చెందిన 94 ఏళ్ల వయసున్న సున్నీ మత గరువు షేక్ అబూబకర్ అహ్మద్ యెమెన్ లో ఉన్న ముస్లిం మత పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ కూడా నిమిషా విడుదలకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్ భారత ప్రభుత్వానికి కూడా నిమిషా ప్రియ విషయంలో జోక్యం చేసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. 17 నవంబర్ 2023లో సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం నిమిసా ప్రియ విషయంలో ప్రధానికి లేఖ రాశాడు. ఎలాగైనా నిమిషా ప్రియను కాపాడాలని ఆ లేఖలో ఆయన కోరారు.
అంతర్యుద్ధంలో యెమెన్
యెమెన్ దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. యెమెన్ లో సివిల్ వార్ నడుస్తోంది.. సుస్థిరమైన ప్రభుత్వం లేక యెమెన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆధిపత్య పోరులో కొట్టుకు చస్తున్న యెమెన్‌లో ఇప్పడు హౌతీల మాటే ఎక్కువగా చలామణి అవుతోంది. నిమిషా ప్రియ ఉదంతం జరిగిన ప్రాంతం హౌతీల పాలనలో ఉండడంతో ఈ దశలో భారత ప్రభుత్వం దౌత్య పరంగా ఎవరితో చర్చించాలో తెలియని పరిస్థితిలో ఉంది, అయినా భారత ప్రభుత్వం యెమెన్ తో సంప్రదింపులు జరుపుతోంది. చివరికి నిమిషా ప్రియ పరిస్థితి ఏమవుతుందో చూడాలి. ఉరి శిక్ష అయితే వాయిదా పడింది కాని బ్లడః మనీకి మహదీ కుటుంబం ఒప్పకుందా లేదా అనే విషయాలు ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. 11 కోట్ల బ్లడ్ మనీ తీసుకోవడానికి మహది కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు వార్తుల వస్తున్నాయి.ఒక వేళ బ్లడ్ మనీ తీసుకోవడానికి మహది కుటుంబ సభ్యలు ఒప్పకుంటే నిమిషా ప్రియ కు పడ్డ ఉరి శిక్ష యావజ్జీవ కారాగార శిక్షగా మారే అవకాశం ఉంది.
…………………………………………………
