* సోషల్ మీడియాలో అభిమాని పోస్టుకు రేణుదేశాయ్ రిప్లయ్
* దయచేసి నన్ను టార్చర్ చేయొద్దని వార్నింగ్
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆకర్షణగా మారిన రాజకీయ నాయకుడు. పదేళ్ల కష్టానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు సాధించారు. అధికారంలోకి వచ్చారు. కాగా, ఎన్నికల ప్రచార సమయంలో ఆయన పెళ్లిళ్లపై జగన్ విమర్శలు చేసిన విషయం విదితమే. ఇప్పుడు ఆయన మాజీ భార్యల్లో ఒకరైన రేణుదేశాయ్ తాజాగా చేసిన కామెంట్ వైరల్‌గా మారింది. రేణు దేశాయ్ ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే రేణుదేశాయ్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టిన పవన్ అభిమానులు కామెంట్లు పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నా పర్సనల్ లైఫ్‌లోకి పవన్ కళ్యాణ్‌ను తీసుకురాకండి అని రేణు దేశాయ్ ఎన్ని సార్లు వేడుకున్న పవన్ అభిమానులు మాత్రం రేణు ఎలాంటి పోస్ట్ పెట్టిన ఆ పోస్ట్ కింద కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీలో మంత్రి అయిన సందర్భంగా.. ఓ అభిమాని రేణును ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాగా.. ఆ అభిమానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది రేణు దేశాయ్.
తాజాగా ఏం జరిగిందంటే..
సుధాకర్ అనే పవన్ అభిమాని రేణు దేశాయ్‌ని ట్యాగ్ చేస్తూ.. ”వదిన గారు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు అయినా మీకు పవన్ విలువ తెలిసింది. ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన. మిమ్మల్ని మిస్ అవుతున్నాం”. వదిన అంటూ కామెంట్ చేసాడు. ఈ పోస్ట్‌కు రేణు దేశాయ్ రిప్లయ్ ఇస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ”సుధాకర్ గారు మీకు కొంచెం అన్నా బుద్ధి ఉంటే ఇలా చెప్పరు. పవన్ కళ్యాణ్ ను నేను వదిలేయలేదు. అతనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. దయచేసి నన్ను టార్చర్ చేయకండి”. ఇలాంటి కామెంట్స్ పెట్టి అంటూ రేణు దేశాయ్ తెలిపారు.
————————–