కర్నూలు ఎన్నికల ప్రచార సభలో జగన్
* మైనార్టీలపై నాది నిజమైన ప్రేమ
* ముస్లిం రిజర్వేషన్లపై జగన్ కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, కర్నూలు : ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జత కట్టారని, ఆయన రాజకీయం ఊసరవెల్లి రాజకీయం అని, బాగా ముదిరిపోయిన తొండ చంద్రబాబు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. 4 శాతం రిజర్వేషన్లను మైనార్టీలకు రద్దు చేస్తామన్న బీజేపీతో కొనసాగుతామని చెబుతూ, మరోపక్క రాష్ట్రంలో మైనార్టీలపై ప్రేమ చూపుతున్నారని అన్నారు. ఆరు నూరైనా, నూరు ఆరైనా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే అని చెప్పారు. కర్నూలులో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడారు. ఎన్ఆర్సీ, సీఏఏ లో ముస్లింలకే నా మద్దతు అని ప్రకటించారు. 59 నెలల్లో ముస్లింలకు సమున్నత స్థానం కల్పించామని వెల్లడించారు. ఊసరవెళ్లి రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ బిడ్డగా చెబుతున్నా.. తనది మైనారిటీలపై నిజమైన ప్రేమ అని తెలిపారు.
——————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
