* నాలుగు రోజుల పాటు సొంతూరులోనే మకాం
ఆకేరున్యూస్, అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు సొంత నియోజవర్గం పులివేందులలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని.. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం పర్యటన మొదలవుతుందని.. ఈ నెల 27న తిరిగి బెంగళూరుకు జగన్ వెళ్ళిపోతారని తెలిపాయి. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్లి రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు.
25న ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించి.. పులివెందుల చేరుకుని రాత్రికి బస చేస్తారు. పులివెందుల క్యాంప్ ఆఫీస్‌లో వైఎస్ జగన్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరగనున్న వివాహానికి వైఎస్ జగన్ హాజరవుతారు. అనంతరం బయలుదేరి బెంగళూరు వెళతారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
