KTR Voters Rights
* ఓటర్ల హక్కులను కాపాడటమే లక్ష్యంగా పనిచేయాలి
– కేటీఆర్ పిలుపు
ఆకేరు న్యూస్,హన్మకొండ: ఓటర్ల హక్కులను కాపాడడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట తారక రామారావు పిలుపునిచ్చారు కడిపికొండలోని సత్యసాయి కన్వెన్షన్ హాల్లో వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరై (ఎస్ ఐ ఆర్) సభ్యత్వ నమోదు మరియు సోషల్ మీడియా శిక్షణ తరగతులు నియోజకవర్గం ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) ప్రక్రియలో మరియు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs) అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు (కేటీఆర్) పిలుపునిచ్చారు.
ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం, తెలంగాణ అమర వీరుల స్థూపం మరియు తెలంగాణ తల్లి విగ్రహణానికి పూల మాల వేసి , జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడారు.
నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ ఇన్చార్జులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన దీనిపై దిశా నిర్దేశం చేశారు.
* కుట్రలను తిప్పికొట్టాలి..
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓటర్ల జాబితా నుండి అర్హులైన ఓటర్ల పేర్లను ఇష్టారాజ్యంగా తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నాయని, ఆ కుట్రలను క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవాలని సూచించారు .
ఓటర్ల జాబితాలో నకిలీ (బోగస్) ఓటర్ల చేరికను, అలాగే ఒకే ఓటరు పేరు రెండు చోట్ల (Double Entries) నమోదు కాకుండా బూత్ స్థాయి ఏజెంట్లు నిశితంగా పరిశీలించాలన్నారు టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని స్పష్టం చేశారు.
* మళ్లీ కేసీఆర్ పాలనే కావాలి..
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, మెజారిటీ ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి, ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందనే నమ్మకాన్ని కలిగించాలని పార్టీ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
