Raghunathapally former ZPTC (File Photo)
* ఉరివేసుకొని బలవన్మరణం..
* తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు, స్థానికులు
ఆకేరు న్యూస్, జనగామ జిల్లా : రఘునాథపల్లి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మండల మాజీ జడ్పీటీసీ బొల్లం అజయ్ మణికంఠ (Raghunathapally former ZPTC ) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.
* ఆత్మహత్యకు అసలు కారణాలేంటి?
అజయ్ మణికంఠ ఆత్మహత్యకు గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టి కారణాలను వెల్లడించాల్సి ఉంది.
* తీవ్ర దిగ్భ్రాంతిలో కుటుంబ సభ్యులు..
మాజీ జడ్పీటీసీ అజయ్ మణికంఠ (Raghunathapally former ZPTC) మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

