Warangal Collector Dr. Satya Sarada met National Commission for Scheduled Tribes member Jatoth Hussain Naik
* జాటోత్ హుస్సేన్ నాయక్‌కు స్వాగతం
* కలెక్టర్ డాక్టర్ సత్య శారద
ఆకేరు న్యూస్, వరంగల్ : జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం వరంగల్‌లోని హరిత కాకతీయ హోటల్లో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు కలెక్టర్ సత్య శారద పూల మొక్కను అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సుమ, వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

