జయంత్ అండ్ ది జింగో పెన్
Jayanth And the Jingo Pen| ఆకేరు న్యూస్, సినిమా: చిన్నారులు, కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన తెరకెక్కించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. ఈ సినిమా నవంబర్ 12న చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
భారీ తారాగణం
ఈ చిత్రంలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ‘మన శంకర వర ప్రసాద్’ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఘనంగా ట్రైలర్ లాంచ్
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను లిటిల్ ఫ్లవర్ స్కూల్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాతలు ప్రవీణ్ బొలిశెట్టి, దివ్య ప్రవీణ్ బొలిశెట్టి, దర్శకుడు నవీన్ దేశబోయిన, నటులు ఆశిష్ గాంధీ, సత్యం రాజేష్, బేబీ ఊహా రెడ్డి, మాస్టర్ జయంత్, మానిక్ రెడ్డి, కాశీ విశ్వనాథ్, సహ నిర్మాత షఫీ తదితరులు పాల్గొన్నారు.
కుటుంబమంతా చూడదగిన చిత్రం
చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సినిమాను చూడాలని చిత్ర బృందం కోరుతోంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలతో కలిసి ఆనందించదగిన చిత్రంగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నిలుస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

