Jhansi Rajender Reddy
* ఆరోగ్య పరిస్థితిపై ఆరా
ఆకేరు న్యూస్, రాయపర్తి : మండలంలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, గురువారం పరామర్శించారు.
ముందుగా రాయపర్తి మండలం కొలనపల్లి గ్రామానికి చేరుకుని ఇటీవల కంటి శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణమాచార్యులని కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.
అనంతరం రాయపర్తి మండలం సూర్య తాండకు వెళ్లి, అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ నాయకులు హమ్య నాయక్ ని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని అవసరమైన వైద్య చికిత్సను నిర్లక్ష్యం చేయకుండా తీసుకోవాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా నాయకులిద్దరూ త్వరగా కోలుకుని ప్రజా సేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని ఝాన్సీ రాజేందర్ రెడ్డి, ఆకాంక్షించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
