Jr NTR Shoulder Surgery
* నేడు హైదరాబాద్ లో శస్త్ర చికిత్స
ఆకేరు న్యూస్, హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కీలక ఆరోగ్య సమాచారం వెలువడింది. ఇటీవల తారక్ కు జిమ్ లో భుజానికి గాయం కాగా బుధవారం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. గాయాన్ని వైద్యులు పూర్తిగా పరిశీలించిన అనంతరం సర్జరీ చేయాలని నిర్ణయించినట్లు ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటికే వైద్యుల సూచనల మేరకు చికిత్స కొనసాగుతుండగా, తాజా వైద్య పరీక్షల అనంతరం సర్జరీ అవసరమని నిర్ణయించినట్లు ఆయన టీమ్ తెలిపింది. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతుందని వెల్లడించింది.
* కోలుకునే వరకు షూటింగ్‌లకు దూరం
శస్త్రచికిత్స అనంతరం ఎన్టీఆర్ పూర్తిగా కోలుకునే వరకు షూటింగ్‌లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. వైద్యులు గతంలో ఆయనకు కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించడం విదితమే. దీంతో ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని డ్రాగన్ సినిమా షూటింగ్ షెడ్యూల్‌పై కూడా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.
* స్పష్టమైన సమాచారం వెల్లడించే చాన్స్
ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సర్జరీ అనంతరం వైద్యులు మరింత స్పష్టమైన సమాచారం వెల్లడించే అవకాశం ఉంది. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా తారక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
