* ఉత్తి చేతులతో వచ్చారు : కేఏ పాల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పెట్టుబడుల కోసం పది రోజుల పాటు విదేశాల్లో తిరిగి.. ఈరోజు ఖాళీ చేతులతో వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి(CM. Revanth Reddy)ని కేఏ పాల్ విమర్శించారు. నాతో వచ్చి ఉంటే భారీ పెట్టుడులు ఇప్పించేవాడినని చెప్పారు. కేఏ పాల్ (KA Paul)మీడియాతో మాట్లాడుతూ.. అమెజాన్(Amazon), మైక్రోసాఫ్ట్(MIcrosoft)తో పాటు ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ పెట్టుబడులు పెట్టాయా..? అమెరికాలో కొన్ని వేల కంపెనీలు ఉంటాయి.. ఒక్క కంపెనీ అయినా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందా..? అంటే లేదు.. కేవలం రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో తిరిగొచ్చారు అని కేఏ పాల్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రులందరినీ తీసుకుపోతానని గతంలో రేవంత్ రెడ్డికి చెప్పానని, అమెజాన్, టెస్లా సీఈవోలను కలుద్దామని, వారం రోజుల్లో ఆస్టిన్(Astin), డల్లాస్(Dallas), న్యూయార్క్(Newyork), లాస్ ఏంజెల్స్తో పాటు మరిన్ని నగరాలకు వెళ్దామని మాట కూడా ఇచ్చానన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు తనతో రాలేదన్నారు. ఇప్పుడు ఎన్ని ట్రిప్పులు వేసినా రాజకీయ నాయకులను ఎవరు నమ్మరు అని రేవంత్ రెడ్డికి ఇప్పుడు అర్థమైందని కేఏపాల్(KA Paul) విమర్శించారు.
———————————–