నివాళులర్పిస్తున్న మడిపల్లి మాజీ ఎంపీటీసీ జక్కన్న మహబూబ్ రెడ్డి
* కంటాయపాలెంలో రెండు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
* ఒక్కో కుటుంబానికి రూ.3 వేల నగదు, 25 కేజీల బియ్యం అందజేత
ఆకేరు న్యూస్, తొర్రూరు : ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని మడిపల్లి మాజీ ఎంపీటీసీ జక్కన్న మహబూబ్ రెడ్డి (Mahabub Reddy) అన్నారు. మండలంలోని ఏ గ్రామంలోనైనా అనారోగ్యం, ప్రమాదం, యాక్సిడెంట్ లేదా మరణం సంభవించినప్పుడు బాధిత కుటుంబాల ఇళ్లకు నేరుగా వెళ్లి పరామర్శించడంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
* కంటాయపాలెంలో రెండు కుటుంబాలకు పరామర్శ..
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం కంటాయపాలెం గ్రామంలోని రెండు బాధిత కుటుంబాలను కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఒక్కో కుటుంబానికి రూ.3 వేల నగదు, 25 కేజీల బియ్యాన్ని అందజేశారు.
గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మచ్చ బిక్షం సతీమణి మచ్చ యాదలక్ష్మి ఇటీవల మృతిచెందారు. దీంతో మడిపల్లి మాజీ ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ ట్రెజరర్ జక్కన్న మహబూబ్ రెడ్డి (Mahabub Reddy), తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కా ఇంద్రసేన రెడ్డి ఆమె ఇంటికి వెళ్లారు. యాదలక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.3 వేల నగదు, 25 కేజీల బియ్యాన్ని అందజేశారు.
అదే గ్రామానికి చెందిన కిన్నెర సూరమ్మ అనారోగ్యంతో మృతిచెందడంతో ఆమె కుటుంబాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రూ.3 వేల నగదు, 25 కేజీల బియ్యాన్ని అందజేశారు.
* ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటాం..
మండలంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా, ఏ కష్టం ఎదురైనా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి సహకారంతో అన్ని విధాలా అండగా ఉంటామని నాయకులు తెలిపారు. బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని భరోసా కల్పించారు.
* కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు..
తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు యనగందుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గడీల మాధవి సాయిలు, మాజీ ఎంపీటీసీ మోకాటి వెంకన్న, గ్రామ పార్టీ అధ్యక్షుడు మందపురి శ్రీధర్, వెన్నం సోమిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు, వార్డు సభ్యులు పంజాల అల్లూరు, గంగదారి యాకాంబరం, పేరబోయిన అశోక్, మేడ సాయిలు, ఎండి మస్తాన్, సిరిపాటి జగన్నాథం, సిరిపాటి శ్రీను, కిన్నెర బుచ్చయ్య, యర్రం రాజు యాదవ్, యాసం వెంకన్న, వేర్పుల సంపత్, ఈదునూరి యాకయ్య, ఈదునూరి మధు, ఎస్కే చాంద్ పాషా, జోగి వీరభద్రం, పేరబోయిన వెంకన్న, గోనె ప్రవీణ్, ఎండి మై పాషా, ఎండి ఇముల్ పాషా, మేడ యాకయ్య, డప్పు ప్రవీణ్, వేర్పుల సమ్మయ్య, వేర్పుల శ్యామ్, శివరాత్రి అశోక్‌తో పాటు గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
Read Also : బిస్లరీ వాటర్ వివాదం..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

