Maha Padayatra
* బస్సుల ర్యాలీని ప్రారంభించిన ఎర్రబెల్లి సంపత్ రావు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్లో సోమవారం నిర్వహిస్తున్న మహా పాదయాత్రకు (Maha Padayatra) కమలాపూర్ మండలం నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.
సోమవారం ఉదయం కమలాపూర్ మండల కేంద్రం నుండి మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక బస్సులలో కరీంనగర్‌కు మహా పాదయాత్ర (Maha Padayatra)కు బయలుదేరారు.
ఈ సందర్భంగా కమలాపూర్ నుండి తరలివెళ్లే బస్సుల ర్యాలీని బీజేపీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు, కమలాపూర్ మండల ఇన్చార్జ్ ఎర్రబెల్లి సంపత్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

