Hanuman Jayanti Celebrations Telangana
ఆకేరు న్యూస్, కమలాపూర్:
కమలాపూర్ మండలవ్యాప్తంగా వైశాఖ బహుళ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. మండలంలోని కమలాపూర్, ఉప్పల్ , భీంపల్లి, శంభునిపల్లి, కానిపర్తి, దేశరాజు పల్లి, పలు గ్రామాల్లోని ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గత 41, 21, 11 రోజులుగా కఠిన దీక్షలో ఉన్న వందలాది హనుమాన్ మాలాధారులు నేడు తమ ఇరుముడులను ఆలయాల్లో సిద్ధం చేసుకుని, దీక్షా విరమణ కోసం ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కొండగట్టు అంజన్న ఆలయం, ఇల్లంతకుంట దేవాలయం , భద్రాద్రి సీతారామచంద్ర స్వామి సన్నిధికి బయలుదేరారు. జయంతి వేడుకలు మంగళవారం రావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
