Bandi Bhagirath Arrest Demand
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
బండి భగీరథను అరెస్టు చేసి రిమాండ్ తరలించాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని ఎస్ఎఫ్ఐ స్టేషన్ ఘన్ పూర్ మండల కమిటీ కార్యదర్శి సాయి తేజ, మండల అధ్యక్షులు భూక్యా అంజి డిమాండ్ చేశారు.
మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంటనే బండి భగీరథ్ ను అరెస్టు చేసి రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికార బలంతో తమ కొడుకు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం బండి సంజయ్ చేస్తున్నారు, అధికార అహంకారంతో మహిళల భద్రతను బండి సంజయ్ తాకట్టు పెడతారా అని వారు ప్రశ్నించారు. పోక్సో కేసు నమోదైన బీజేపీ నాయకత్వం స్పందించడం లేదు రాష్ట్రంలో ఎక్కడైనా అల్లర్లు సృష్టించడం, మతోన్మాదం పేరుతో గొడవలు చేయడం మాత్రమే బిజెపి నైజామా? దేశంలో చట్టాన్ని భద్రతను కాపాడాల్సిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఇంట్లోనే చట్టాన్ని ఉల్లంఘించడం సమాజానికి ఏం సందేశాన్నిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడిపై పోక్సో లాంటి తీవ్రమైన కేసు నమోదు అవుతుంటే ఏ నైతిక విలువలతో తన కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ పదవిలో ఉండి ప్రజలు సిగ్గుపడే పని చేసిన తన కొడుకుని సమర్ధించుకొస్తున్న బండి సంజయ్ తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అన్యాయానికి గురైన మైనర్ బాలిక కుటుంబానికి భద్రత కల్పించాలి బండి భగీరథ్ గతంలో మహేంద్ర యూనివర్సిటీలో ర్యాగింగ్ చేయడం, డ్రగ్స్ తీసుకోవడం చెడు అలవాట్లతో తన తండ్రి అండతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం గతంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. బాధితురాలికి రక్షణ కల్పించి, సమగ్ర విచారణ ద్వారా న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ సభ్యులు రాంచరణ్,తరుణ్,హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
