Published:
ఆకేరున్యూస్, హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి రాబోతున్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ సంతోష్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కాగా, ఉన్నట్టుండి గులాబీ బాస్ కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకోవడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషయంలో గులాబీ శ్రేణులు కాస్త ఆందోళనకు లోనవుతున్నారు. కాగా గతంలోనూ పలుమార్లు ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు.
…………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
