
* విమాన ప్రమాద ఘటనపై మోదీ
*అహ్మదాబాద్ లో పర్యటన
* ఘటనకు కారణాలపై ఆరా
ఆకేరు న్యూస్, డెస్క్ : గుజరాత్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 265 ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. నిన్న ప్రమాదం జరిగిన స్థలాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (NARENDRA MODI) సందర్శించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకు వెళ్లారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ విచారణం వ్యక్తం చేశారు. ఇంతమంది ఈ ప్రమాదంలో చనిపోవడం చెప్పలేని విషాదమన్నారు. తమ వారికి కోల్పోయిన కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. వారి బాధను అర్థం చేసుకోగలం.. ప్రమాదస్థలి దగ్గర పరిస్థితి దయనీయంగా ఉందని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ విశ్వాస్ (RAMESH VISWAS)ను పరార్శించారు. ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును ఆయనను అడిగి తెలుసుకున్నారు. కాగా, డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ప్రమాదంలో మృతదేహాలన్ని కూడా మాంసపు ముద్దల్లా మారిపోవడం, తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలను నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ కోసం అధికారులు శాంపిళ్లను సేకరించారు. డీఎన్ఏ(DNA) పరీక్షల అనంతరం మృతుదేహాలను గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగించనున్నారు.
……………………………………………………………..