Kishan Reddy Parade Ground Visit
* తెలంగాణకు రూ.10వేల కోట్ల పెట్టుబడులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (KISHANREDDY) లేఖ రాశారు. తెలంగాణలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు కొన్ని కంపెనీలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. కోల్ ఇండియా, ఎన్ ఎల్సీ ఇండియా ముందుకు వచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. సౌర, పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయన్నారు. పంప్డ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీలోనూ పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇదిలాఉండగా తెలంగాణకు మోదీ ఏం ఇచ్చారని, కిషన్ రెడ్డి ఏం తెచ్చారని సీఎం రేవంత్ (CM REVANTH) ప్రశ్నించారు. 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే వారు ఏం చేశారో నిలదీయాలని అన్నారు. తెలంగాణ(TELANGANA)పై ఎందుకింత వివక్ష అన్నారు. తాము ఎలాంటి భేషజాలకు పోకుండా, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, కిషన్ రెడ్డి తమకు సహకరించాలని కోరారు. ఈ క్రమంలో తాజాగా రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ రాయడం ఆసక్తిగా మారింది.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
