* ప్రారంభించిన మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రం లోని ఎస్సి సబ్ ప్లాన్ ద్వారా అంతర్గత సిసి రోడ్స్ కోటి 78 లక్షలు తో నిర్మాణం చేపట్టిన సిసి రోడ్లకు శంకుస్థాపన చేసి ఆ రోడ్లను పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల తో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలని కోరారు .అర్హులైన అందరికీ ప్రతి ఒక్క పథకం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఐటీడిఏ పి ఓ చిత్ర మిశ్రా,మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి,ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, బ్లాక్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న,డైరెక్టర్ వసంత శ్రీనివాస్,జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్,మండల అధ్యక్షులు చిటమట రఘు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు,మహిళా నాయకురాల్లు,అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
