మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రభాకర్ రావు నుంచి కేటీఆర్ వరకూ..
* 3 నెలల్లో బీఆర్ ఎస్ దుకాణం బంద్
* బతుకమ్మ చాటున మందు సీసాలు అమ్మారు
* కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం కడతాం
* మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ పార్టీపైన, కేసీఆర్ ఫ్యామిలీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komati Reddy Venkat Reddy ) . ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని, రేవంత్ రెడ్డే ( Revanth Reddy ) బీజేపీలోకి జంప్ చేయవచ్చునేమో అని బీఆర్ ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ( KCR ) నిన్న చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడమని సవాల్ విసిరారు. 3 నెలల్లోనే బీఆర్ ఎస్ దుకాణం బంద్ అయితదని చెప్పారు. ప్రభాకర్ రావు నుంచి తారక రామరావు వరకు జైలుకు పోతారని జోస్యం చెప్పారు. చంచల్ గూడ జైలులో కేసీఆర్ ఫ్యామిలీకి డబుల్ బెడ్రూమ్ కడతామని, అది కూడా వారికి సరిపోతాదో, లేదో అని ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోవడంతో తండ్రీకొడుకులకు మెంటల్ లేసినట్లుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మాట ఎత్తితే మర్యాద దొరకదని హెచ్చరించారు. బతుకమ్మ చాటున మందు సీసాలు అమ్మారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని, కాంగ్రెస్ లక్ష్యం 15 సీట్లని, 12 లేదా 13 సీట్లు సాధించి తీరుతామని కోమటిరెడ్డి తెలిపారు. మరో సీనియర్ నేత జానారెడ్డి కూడా కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. రేవంత్ సర్కారుకు ఢోకా లేదని చెప్పారు.
———————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
