KTR Revanth Debt Challenge
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ నేతలు ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన మొత్తం అప్పు కేవలం రూ. 2.80 లక్షల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. కానీ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్ల (దాదాపు రెండేళ్ల) కాలంలోనే ఏకంగా రూ. 4 లక్షల కోట్ల అప్పులు చేసిందని కేటీఆర్ సంచలన గణాంకాలను బయటపెట్టారు.
* ప్రజలను మభ్యపెట్టేందుకే తప్పుడు ఆరోపణలు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అప్పుల పేరుతో కాంగ్రెస్ నాయకులు కావాలనే నిందలు వేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. వాస్తవాలను వక్రీకరిస్తూ, ప్రజలను మభ్యపెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే నిరంతరం కేసీఆర్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇప్పటికైనా అవాస్తవాలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
