MLC Election Strategy KTR
* నేడు కీలక సమావేశం
ఆకేరు న్యూస్,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు.
ప్రధానంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC Election) ఎన్నికలపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
ఎన్నికల్లో పార్టీ బలాలు, బలహీనతలు, పట్టభద్రుల ఓటర్లను ఆకట్టుకునేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో నేతల సమన్వయం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రుల ఓటర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు, ఎన్నికల కార్యాచరణను రూపొందించేందుకు నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
