Telangana TET Results 2026
* 15వేల 749 మంది అర్హత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో ఇన్ సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించిన టెట్ ఫలితాలు (Telangana TET Results 2026) విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 70.07 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 15,749 మంది ఉపాధ్యాయులు టెట్‌లో అర్హత సాధించారు.
ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రతి ఏడాది రెండుసార్లు టెట్ నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తదుపరి టెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను అక్టోబర్ 1న విడుదల చేయనున్నారు.
అనంతరం నవంబర్‌లో రెండో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. దీంతో ఇన్ సర్వీస్ టీచర్లు తమ టెట్ అర్హతను సాధించేందుకు ఏడాదిలో రెండు అవకాశాలు పొందనున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
