* వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
ఆకేరున్యూస్, వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైన ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాలు విక్రయించినా.. వినియోగించినా వారిపై చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో యువతీ, యువకులు గాలిపటాలను ఎగరవేయడానికి సిద్దమవుతున్న వేళ గాలిపటాల విక్రయదారులు చైనా మాంజాను విక్రయించడం జరుగుతోందని.. నైలాల్, సింథటిక్ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాలతో మనుషులతో పాటు ఎగిరేపక్షులకు ప్రమాదకరం కావడంతో పాటు పర్యవరణానికి విపత్తుగా కావడంతో జాతీయ హరిత ట్రిబ్యూనల్ ఆదేశాలను మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది.
ఇందులో భాగంగా కొద్ది రోజులుగా టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసుల అధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో సూమారు 2లక్షల 62వేల రూపాయల విలువైన చైనా మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే కమిషనరేట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో చైనా మాంజా విక్రయాలు జరగకుండా తగుచర్యలు తీసుకొవడం జరుగుతోందని సీపీ తెలిపారు. ప్రధానంగా ప్రజలు సైతం చైనా మాంజా వినియోగంపై దూరంగా ఉంటూ ఎవరికి హాని కలగని సాధారణ దారంతో గాలిపటాలను ఎగురవేసుకోవాలని. అలాగే ఎవరైన చైనా మాంజా విక్రయిస్తున్న, వినియోగిస్తున్నా డయల్ 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సీపీ ప్రజలకు సూచించారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
