* మాజీ పెద్ది సుదర్శన్ రెడ్డి
ఆకేరున్యూస్, వరంగల్: రైతు భరోసాపై డిప్యూటీ సీఎంను కలిసి రిప్రజెంటేషన్ ఇస్తామని పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లనీయకుండా బీఆర్ఎస్ కార్యాలయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి సహా పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు భరోసా విషయంలో కేబినెట్ నిర్ణయం రైతులకు విస్మయం కలిగించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 70 లక్షల మంది రైతులను మోసం చేశారని.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ నుంచే రైతుల తిరుగుబాబు మొదలైతదన్నారు. సన్న, చిన్నకారు రైతులంతా వ్యవసాయ కూలీలే అని.. జాబ్ కార్డున్న ఉపాధిహామీ కూలీలంతా వ్యవసాయ కూలీలే అన్నారు. జాబ్ కార్డుదారులందరికీ రూ.12 వేలు ఇవ్వాల్సిందేనని .. వరంగల్ పర్యటనకు వస్తున్న డిప్యూటీ సీఎం రైతులకు క్షమాపణ చెప్పాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
