Gandhi Jayanti
Gandhi Jayanti| ఆకేరు న్యూస్, పాలకుర్తి: మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగు శ్రీనివాస్ అన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని జనగామ రోడ్డు బస్టాండ్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోగు శ్రీనివాస్ మాట్లాడుతూ.. అహింసను ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపించారని తెలిపారు.
సత్యం, అహింస, శాంతి, సామాజిక సమానత్వం వంటి గాంధీజీ ఆశయాలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయని అన్నారు. ప్రజలను ఐక్యం చేసి స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములను చేసిన గాంధీజీ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, ఐకమత్యంతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పోగు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సమానత్వం, పరిశుభ్రత, సామాజిక బాధ్యత వంటి విలువలను ఆచరణలో పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
