* ముగ్గురు విద్యార్థులు దుర్మరణం
* కారును ఢీకొనడంతో వ్యాను నుజ్జునుజ్జు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ హయత్‌నగర్ పరిధిల కుంట్లూరులో ఈరోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. డీసీఎం వ్యాను ను ఓ కారు ఢీకొనడంతో నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతి వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. కుంట్లూరు కు చెందిన విద్యార్థులు పిన్నింటి చంద్రసేన రెడ్డి(24), చుంచు త్రినాధ్ రెడ్డి(24), చుంచు వర్షిత్ రెడ్డి(23) మృతి చెందారు. గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital) కి తరలించారు. క్షతగాత్రుడు అలిమేటి పవన్ కల్యాణ్(24)ను చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించారు. స్కోడా కారులో పాసుమాముల గ్రామం నుంచి కుంట్లూరు వైపు వస్తున్నారు. డీసీఎం వ్యాన్ కుంట్లూరు నుంచి పాసుమాముల వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
